నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి 80 కి.మీ., నెల్లూరుకు 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని.. పశ్చిమ వాయువ్య దిశగా 22 కిమీ వేగంతో వాయుగుండం కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. తరువాత వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందన్నారు. గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.