రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచీ ఒక వ్యాపారవేత్త తయారయ్యేలా, ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఆరు పాలసీలను రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన ఆరు పాలసీలు గేమ్ చేంజర్లుగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తలకు మళ్లీ నమ్మకం కుదిరేందుకుగాను అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని పునరుద్ఘాటించారు. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందని, కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందని తెలిపారు.
బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం వెలగపూడి సచివాలయంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్‌లతో కలసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల ఆకర్షణ.. ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఎలకా్ట్రనిక్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవల్‌పమెంట్, ఎంఎ్‌సఎంఈ పాలసీ, ప్లగ్ అండ్ ప్లే ఇండిస్ట్రియల్ పాలసీలను తీసుకువచ్చామని చంద్రబాబు చెప్పారు.