ఇసుక అక్రమాలపై జగన్ రెడ్డి ప్రభుత్వ హయాం నుంచి పోరాడుతున్నానని, ప్రభుత్వం మారిన తరువాత టీడీపీ నేత కూన రవికుమార్ ఇసుక ఆగడాలను అడ్డుకుంటున్నాని, దీంతో అతనికి రూ.50లక్షలు నష్టం రావడంతో తననుచంపించే ప్రయత్న చేస్తున్నారని స్వతంత్య్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఒడిపోయిన సురేష్ ఆరోపించారు.
తాను టీడీపీ కుటుంబ సభ్యుడినని, తనతో పాటు తన తండ్రి, తాత కూడా టీడీపీ సభ్యులమేనని, అయినా తనపై కూన రవికుమార్ హత్యాప్రయత్నం చేస్తున్నాడని సనపల సురేష్ ఆరోపించారు. సెప్టెంబరు 27న తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి దాడి చేసేందుకు యత్నించారని, అప్పుడు తప్పించుకున్నానని తెలిపారు. తనపై జరుగుతున్న దాడులు, హత్యాయత్నంపై కలెక్టర్‌తో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేసిపనా పట్టించుకోవడం లేదన్నారు.