‘కేడీసీసీ బ్యాంక్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. త్వరలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తాం. రైతులే ఓట్లువేసి పాలకవర్గాన్ని ఎన్నుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాచరణ రూపొందించారు.’ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రూ.కోటి 10 లక్షలతో నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంక్ మోపిదేవి బ్రాంచి నూతన భవనాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గురువారం రవీంద్ర ప్రారంభించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజాప్రతినిధులే బినామీ లుగా రుణాలు పొంది సహకార వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఎంపీపీ రావి దుర్గావాణి, కేడీసీసీ బ్యాంక్ సీఈవో శ్యామ్ మనోహర్, బీఎం చంద్రశేఖర్, చల్లపల్లి, మోపిదేవి బ్రాంచ్ మేనేజర్లు నాగరాజ కుమారి, సల్మా సుల్తానా సయ్యద్, సర్పంచ్ నందిగం మేరీ రాణి, జడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.