కేవలం రెండునెలల సమయం మాత్రమే ఇస్తున్నానని, జనవరి నుంచి అపరిశుభ్రత ఏ దుకాణం ముందు కనిపించినా మూసివేయిస్తామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం చికెన, మటన, కోళ్లఫారం, కోడిగుడ్ల వ్యాపారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. రెండునెలలు మాత్రమే సమయం ఇస్తున్నానని, అప్పటిలోగా ప్రతి దుకాణం ముందు కొంచెం కూడా అపరిశుభ్రత కనిపించకూడదని తెలిపారు.
నిబంధనలు పాటించకపోతే షాపులను మూసివేయిస్తానని అన్నారు. ప్రతి దుకాణానికి లైసెన్సును కలిగి ఉండాలన్నారు. అనంతపురం, నార్పల, యాడికి తదితర మండలాలతో పోలిస్తే తాడిపత్రిలో మాంసం ధరలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో ధరలను ఉంచాలని సూచించారు. చికెన, మటన, గుడ్ల ధరలను ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్‌కు తెలియజేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, దుకాణ యజమానులు పాల్గొన్నారు.