సాక్షి పత్రికపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపు చర్యలపై విజయవాడ వైయస్ఆర్‌సీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. విజయవాడ వరదల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. వరదల్లో అవినీతి చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పేదలకు, నష్టపోయిన వారికోసం వచ్చిన విరాళాల్లోనూ అవినీతి చేశారని.. ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే వైయస్ఆర్‌సీపీ, ప్రజాసంఘాలపై ఎదురుదాడి చేశారంటూ దుయ్యబట్టారు.
‘‘మీడియా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్ మురళిపై కేసులు పెట్టడం దుర్మార్గం. సాక్షి టీవీని ఆపేయాలంటూ సాక్షాత్తూ మంత్రులే పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజాగొంతుకను నొక్కేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా నిరంతరం మేం ప్రజల పక్షాన పోరాడతాం. మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.