కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కక్ష సాధింపు పెరిగిపోయింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు. సాక్షి పత్రికపై కేసు పెట్టడం అమానుషం అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అయన మాట్లాడుతూ.... మీ తప్పులను ఎత్తిచూపిస్తున్నందుకు ప్రైవేట్ కేసులు వేయడం సరికాదు. కేబుల్ టీవీలో సాక్షి ప్రసారాలను నిలిపివేశారు. వరదల్లో అనేక మంది నష్టపోయారు. వరద బాధితులకు అండగా నిలిచిన సాక్షిపై కేసులు పెట్టడం దుర్మార్గం. తక్షణమే సాక్షిపై పెట్టిన కేసులు ఎత్తేయాలి అని డిమాండ్ చేసారు.