అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం దాన్నుంచి ప్రజలదృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాలు ప్రజల్లో చర్చకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి డైవర్షన్ కు పాల్పడ్డం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి అరెస్టు అని ఆయన వ్యాఖ్యానించారు.