భార్యను వేధింపులకు గురి చేస్తున్న భర్తకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10వేల జరిమానా విధించినట్లు జూనియర్ సివిల్ జడ్జి చందక హరిప్రియ తెలిపారు. నరసన్నపేట స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఈ మేరకు ఆమె తీర్పు వెలువరించారు. పోలీసుల వివరాల ప్రకారం. స్థానిక గాంధీనగర్-1లో నివాసం ఉండే బోనెల సాంబశివరావు, భార్య నాగలక్ష్మీపై వేధింపులకు పాల్పడటంతో 2022లో నరసన్నపేట ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa