ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే రాహుల్ గాంధీ ఢిల్లీలోని బార్బర్ షాపులో ప్రత్యక్షమయ్యారు. మహారాష్ట్ర,జార్ఖండ్ ఎన్నికల వేళ ఎంతో బిజీగా ఉండే రాహుల్..ఢిల్లీలోని ఓ సాదాసీదా సెలూన్ షాపులో ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా బార్బర్ అజిత్‌తో మాట్లాడి నిత్య జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ బార్బర్ షాపులో ట్రిమ్మింగ్ చేయించుకున్న వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. బార్బర్ కష్టాలను చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడంటూ రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న ఆదాయంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వయం ఉపాధి పొందుతూ. ఆత్మగౌరవంతో బతకాలనుకునే వారి కలలు నెరవేరడం లేదని, ఇటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆదాయం పెరిగే మార్గం చూపాలని, వారి నైపుణ్యానికి తగిన ప్రతిఫలం దక్కాలని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో కోరారు.
"कुछ नहीं बचता है!"
अजीत भाई के ये चार शब्द और उनके आसूं आज भारत के हर मेहनतकश गरीब और मध्यमवर्गीय की कहानी बयां कर रहे हैं।
नाई से लेकर मोची, कुम्हार से लेकर बढ़ई - घटती आमदनी और बढ़ती महंगाई ने हाथ से काम करने वालों से अपनी दुकान, अपना मकान और स्वाभिमान तक के अरमान छीन लिए… pic.twitter.com/1gYGdui2ll
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2024