బంగాళాఖాతం తూర్పు- ఆగ్నేయ ప్రాంతంలో ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని శనివారం వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నేటి నుంచి వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు.. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.