బీజేపీ పార్టీ అన్ని రాజకీయ పార్టీలకంటే భిన్నమైనదని, ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త సభ్యులను చేర్చుకోవటంతో పాటు బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులను ప్రజా స్వామ్యం పద్ధతి ద్వారా ఎన్నుకుని ముందుకి వెళ్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్బంగా సోమవారం, విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో సహా అందరూ వారి సభ్యత్వాన్ని పునరుద్దరించుకోవటం జరుగుతుందన్నారు. 2014 లో ఆరు నెలల పాటు సభ్యత్వాన్ని నమోదు చేసామని, ఆన్‌లైన్ ద్వారా మొదటి సారి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గతంలో 11కోట్ల సభ్యత్వాన్ని ఆరునెలలో చేసామని, ఇప్పుడు 45 రోజుల్లో 22 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేసామని పురందేశ్వరి తెలిపారు.
భవిష్యత్‌లో బీజేపీ ఒక బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పని చేస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయిలో పరిపాలనా దక్షత కనభరీచారో దేశాన్ని ఆగ్ర గామిగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీదేనని కొనియాడారు. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్ర రాజధాని అమరావతి కనెక్టివిటీ కొరకు రైల్వే నిర్మాణం చేపట్టడం సంతోషకరమని అన్నారు. కాగా రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుందని, 12,500 కోట్ల రూపాయలు పోలవరం పూర్తి చేయటానికి నిధులు కేటాయిస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు. 900 కోట్ల పై చిలుకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం సాయం అందిస్తామని తెలియచేసారు. గ్రామ సభల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ పర్యటించి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాల గురించి తెలియచేసారని, గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను పక్క దారి పట్టించిన విధానాన్ని పవన్ కళ్యాన్ సైతం గ్రామ సభల్లో వివరించారన్నారు. దేశంలో ఎన్డీయే ఉండాలని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఏపీ రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు పండగ చేసుకోవాల్సిన అవసరం ఉందని.. డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని గతంలోనే చెప్పానని.. ఇప్పుడు జరుగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అశ్వినీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అందరూ రూ. 2,245 కోట్ల నిధులతో ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్లు మేరకు అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసిన అంశాన్ని ప్రకటించటం సంతోషంగా వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహద పడుతుందన్నారు. ఏపీ ఆర్థిక అభివృద్ధితో ముడిపడిన అంశమని.. పర్యావరణ మార్పు వస్తున్న ఈ పరిస్థితుల్లో అడవికి హాని కలగకుండా అంటే 25 లక్షల చెట్లు కాపాడబడ్డాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కేంద్రానికి ఏపీ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదములు తెలుపుతున్నానని పురందేశ్వరి అన్నారు. అమరావతినే రాజధాని అని మొదటి నుంచీ బీజేపీ చెబుతోందని, కేంద్రం కూడా అమరావతి రాజధాని అని మొదటి నుండి ప్రతిపాదిస్తూనే వస్తోందని పురందేశ్వరి అన్నారు. రాజధాని కోసం ప్రత్యేక నిధులు ప్రపంచ బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రైల్ లైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారన్నారు. వికసిత్ భారత్ 2047 వరకు సాధించాలనేది బీజేపీ లక్ష్యమని చెప్పారు. వికసిత్ భారత్ కావాలంటే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమని తెలుసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింహ భాగం కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. అమరావతి రాజధానికి ప్రత్యేక రైల్వే లైన్ మంజూరు చేసిన కేంద్రానికి మరోసారి రాష్ట్ర తరపున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని పురందేశ్వరి అన్నారు.