ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరాల నియంత్రణ కోసం విస్తృ తంగా అవగాహన సమావేశాలు కల్పించాలని, బాధితులు తక్షణమే 1930కు ఫోన్ చేసి రక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ ఆనందోత్సాహాలతో జరుపుకునేలా చర్య లు తీసుకోవాలని, ఎక్కడా అగ్ని ప్రమాదం జరక్కుండా ముందస్తు నివారణ చర్యలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గంజాయి అక్ర మ రవాణా, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. రహదారి భద్రతకు పెద్దపీట వేసి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చే యాలన్నారు. చోరీలు జరక్కుండా రాత్రి గస్తీ మరింత పెంచాలని ఆదేశించారు. మహిళల రక్షణ కోసం త్వరలో మహిళా రక్షక్ వాహనాలు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ వాహనాల వల్ల అన్ని విద్యాసంస్థలు, పార్కుల్లో మహిళలు సంచరించే ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహించడం ద్వారా రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ మోసానికి గురైన బాధితులు వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయాలని, లేనిఎడల 1930 నెంబర్‌కు ఫోన్ చేసి రక్షణ పొందాలని కోరారు. ఈ సమావేశంలో కాకినాడ, పెద్దాపురం డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, డీసీఆర్, డీటీఆర్, ఐటీ కోర్, సీఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.