ఎన్నికల హామీలో భాగంగా వేద పండితులకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వేదిక్ కోర్సు పూర్తయి, మూడేళ్ల నుంచి ఉద్యోగం లేని పండితులకు మాత్రమే ప్రతినెలా రూ.3వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. తొలివిడతలో భాగంగా 600 మందిని దేవదాయ శాఖ గుర్తించగా.. వారికి భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిరుద్యోగ భృతి అందించే బాధ్యతను రాష్ట్రంలోని ఏడు మేజర్ ఆలయాలకు అప్పగించారు. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, దుర్గమ్మ గుడి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల నుంచి వేద పండితులకు భృతి అందిస్తారు.