నెల్లూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. స్వాగత కార్యక్రమంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేశారు. ఈ వేదికపై ఎంపీ వేమిరెడ్డి ఉన్నప్పటికీ అధికారులు విస్మరించారు. గౌరవం లేని చోట ఉండనంటూ సమావేశ వేదికపై నుంచి దిగి ఎంపీ వేమిరెడ్డి వెళ్లిపోయారు. అందరి తరుపున వేమిరెడ్డిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి క్షమాపణ కోరారు. అధికారుల తీరుపై మంత్రి ఆనం సీరియస్ అయ్యారు. మరోసారి పొరపాటు జరగకుండా చూడాలని కలెక్టర్కు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.