గత టీడీపీ ప్రభుత్వంలో 90శాతం గృహాలను పూర్తిచేస్తే జగన్ హయాంలో మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తిచేయలేకపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో ఎన్టీఆర్ టిడ్కో గృహల సముదాయ కాలనీలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు ఉచితంగా ప్రయాణించే వాహనాన్ని ప్రారంభించారు.
స్వయంగా వాహనాన్ని మంత్రి రామానాయుడు నడిపారు. పేదలు,మహిళల గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 5వేల కోట్లను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి పేదలు, మహిళలపై జగన్ ప్రభుత్వం ఐదారులక్షల రూపాయలు అప్పుల భారం మోపిందని మంత్రి రామానాయుడు ఆరోపించారు.