త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ప్రధాన అజెండాగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో మద్యం అధిక రేట్లకు అమ్మినా, బెల్టు షాపులు పెట్టిన కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశాలు జారీచేశామన్నారు.