గత కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం లో ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటన చేసిన అఘోరీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైంది.ఆత్మకూరులో అఘోరీ కారును గుర్తించిన స్థానికులు.. గుమిగూడారు. దీంతో అఘోరీ కారును ఆపకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా.. కొందరు స్థానికులు కారును వెంబడించి ఆపాలని కోరారు.అయినా సరే కారును నిలపకుండా శ్రీశైలం రహదారి మీదుగా వెళ్లింది. దీంతో స్థానికులు నిరాశతో వెనుదిరిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం జరగగా..దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ గుడిలో ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటన చేసింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని, ఆమె ఇంటికి తరలించారు. అక్కడి నుంచి ఆమె మహారాష్ట్ర వెళ్లినట్టు తెలిసింది.