రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మొట్టమొదటి సారిగా ఇంచార్జి మంత్రి హోదాలో శ్రీసత్యసాయి జిల్లా పర్యటన విచ్చేసిన సందర్భంగా పెనుకొండ పట్టణంలో సోమవారం మంత్రి సవిత ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా మంత్రి సవిత స్వగృహంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో మంత్రి సత్య ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, నియోజకవర్గ పరిశీలకులు నరసింహ రావు పాల్గొన్నారు.