రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు 30 అర్జీలు వచ్చాయని అధికారులు మీడియాకు తెలిపారు. అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఎన్ వి రమణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్ రాజ్ లు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు.
కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరించారని తెలిపారు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని, సెల్ టవర్స్ ఏర్పాటు చేయాలని గిరిజనులు అర్జీలు సమర్పించారు.