స్థానిక శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో ఉన్న అన్ని రాజకీయ నాయకుల విగ్రహాలకు ఆదివారం జిల్లా ఎన్నికల అధికారులు, సిబ్బంది ముసుగులు తొడిగారు.
జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారుల ఆదేశాలతో ప్రణాళిక అధికారులు ఆదివారం ఉదయం నుంచి చర్యలు చేపట్టారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగినట్లు అధికారులు తెలిపారు.