మణిపూర్‌లో కుకీ, మైతీ జాతుల మధ్య గత కొంత కాలంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా సాయుధులు మరోసారి రెచ్చిపోయారు. జిరిబామ్ జిల్లాలోని గిరిజన గ్రామమైన జైరోన్హ్మార్‌పై గురువారం రాత్రి దాడులకు పాల్పడ్డారు. ఆరు ఇళ్లకు నిప్పుపెట్టడంతో ఓ ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లల తల్లి మంటల్లో కాలి మరణించింది. విషాదం ఏంటంటే.. భర్త, పిల్లల కళ్ల ముందే ఆమె చనిపోయింది. సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa