విశాలమైన భూమి చుట్టూ తిరిగి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి సాహసం చేయాలి అంటే మనకు ఏదో ఒక మెషిన్ అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఓ పక్షి మాత్రం కేవలం 46 రోజులలో భూమిని చుట్టి వచ్చింది అంటే మీరు నమ్ముతారా?అసలు ఆ పక్షి పేరు ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం పదండి..ఆ పక్షి పేరు ఆల్బాట్రాస్.. సముద్ర పక్షులలో ఇది చాలా పెద్దది.దీని రెక్కల పొడవు సుమారు మూడు మీటర్లు ఉంటుంది. ఆల్బాట్రాస్ 8-12 కిలోల బరువు ఉంటాయి. ఈ జాతికి సంబంధించిన పక్షుల జీవితకాలం చాలా పెద్దది.ఈ పక్షులు దక్షిణ మహా సముద్రం, ఉత్తర పసిఫిక్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి.ఆల్బాట్రాస్‌లలో సాధారణంగా నాలుగు జాతులు ఉన్నాయి.
ఒకప్పుడు సముద్రంలో ప్రయాణించేవారు వీటిని చంపడం అశుభంగా భావించేవారు. అయితే ఒకప్పటి నాయకుల పురాణ రక్షకులుగా గుర్తింపు పొందిన ఆల్బాట్రోసెస్ ఇప్పుడు క్రమంగా అంతరించిపోతున్నాయి. సర్వే రిపోర్ట్ లో ప్రకారం ప్రతి ఏటా సుమారు లక్షకు పైగా ఆల్బాట్రోసెస్ లను చంపుతున్నారని జీవశాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే కొన్ని దశాబ్దాల్లో ఈ పక్షి జాతి భూమి మీద నుంచి తుడిచిపెట్టుకుపోవచ్చు.
ఆల్బాట్రాస్‌లు ఆహారం కోసం , సంతానోత్పత్తి కోసం చాలా దూరం సునాయాసంగా ప్రయాణిస్తుంది.2005లో పక్షి జాతుల పరిశోధకు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ జాతికి చెందిన 22 పక్షులను ఈ సర్వే కు ఉపయోగించారు.ఈ పక్షులకు ట్రాకింగ్ పరికారులు అమర్చి వాటి కదలికలను నిశితంగా పరిశీలించి నివేదిక తయారు చేశారు. అధ్యయనం లో ఈ పక్షుల వలస మార్గాలను ట్రాక్ చేశారు.దక్షిణ అట్లాంటిక్‌లోని దక్షిణ జార్జియా ప్రాంతం నుంచి వలసకు బయలుదేరిన ఆల్బట్రాస్ పక్షులలో కొన్ని46 రోజుల్లో భూమిని చుట్టి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గమనించారు.