గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని రాజాం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆర్ జై భీమ్ హెచ్చరించారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా బెల్ట్ షాపులపై నిర్వహించిన దాడుల్లో 81 మద్యం సేసాలను స్వాధీనం చేసుకొని, 6 గురుపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.