ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టులు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఏడు ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉన్నాయి.. మరికొన్ని ఎయిర్‌పోర్టుల్ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే సీ ప్లేన్ సేవలు ప్రాంతీయ అనుబంధాలను మరింత పెంచుతాయని.. సీ ప్లేన్ కార్యకలాపాల కోసం 8 ప్రాంతాలు ఇప్పటికే గుర్తించినట్లు చెప్పారు. ఆర్ధిక వృద్ధి, పర్యాటకాభివృద్ధికి విమానాశ్రయాలు పెంచుతున్నామన్నారు మంత్రి. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం ద్వారా ఎయిర్ కనెక్టివిటీ పెంచుతామన్నారు. కుప్పం, దగదర్తి, పుటపర్తిలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో రహదారులు భవనాల శాఖకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి ప్రోత్సహకం లభిస్తోందని చెప్పారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏడు ఎయిర్‌పోర్టులను 14కి పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని.. పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడిని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు ఎయిర్‌పోర్టులు పనిచేస్తున్నాయని గుర్తు చేశారు కేంద్రమంత్రి. కొన్ని విమానాశ్రయాలలో టెర్మినల్ సామర్థ్యాలు పెంచే పనులు చేపడుతున్నామని చెప్పారు. వీటిని వెంటనే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.. కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని కూడా కోరగా.. ప్రభుత్వం భూమి గుర్తిస్తే నిర్మిస్తామని రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, నాగార్జునసాగర్, దగదర్తి, కుప్పంలను అభివృద్ధి చేయాలని గుర్తించామన్నారు. అలాగే ఆ తర్వాత తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తామని చెప్పారు పుట్టపర్తిలో ఉన్న ప్రైవేటు ఎయిర్‌పోర్టును ప్రజలకు ఉపయోగపడేలా ఏం చేయొచ్చో చూడాలని ముఖ్యమంత్రి రామ్మోహన్ నాయుడికి చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చిన్న ఎయిర్‌పోర్టులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు భోగాపురం విమానాశ్రయ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సీఎం భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్ని పరిశీలించారు. అంతేకాదు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని.. అన్ని జిల్లాలకు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి లోకేష్ కూడా అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.