మహిళలు పిల్లలకు జన్మ ఇచ్చినప్పుడు రక్తం ఎక్కువగా అవసరం అవుతుంది. తగినంత ఐరన్ లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. అయితే పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది కనుక ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.
అందుకు ఆయా సమయాల్లో మహిళలు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరం నుంచి పోయే రక్తాన్ని భర్తీ చేయవచ్చు. సాధారణంగా 100 గ్రాముల పాలకూరను తింటే 2.7 మిల్లీగ్రాముల మేర ఐరన్ను పొందవచ్చు.