భూమిని ఆక్రమించేసిన మైక్రోప్లాస్టిక్స్ మేఘాల్లోకి చేరాయని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి పర్యావరణాన్ని సైతం ప్రభావితం చేస్తుండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆకాశంలో మైక్రోప్లాస్టిక్లు మంచు కేంద్రక రేణువులుగా పనిచేసి అసహజంగా మేఘాల ఏర్పాటుకు కారణమవుతున్నాయని గుర్తించారు. సాధారణంగా మేఘాలు ఏర్పడే పరిస్థితులు లేకపోయినా మైక్రోప్లాస్టిక్స్లు మేఘాలు ఏర్పడేలా చేస్తాయన్నారు.