చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ వైయస్ఆర్‌సీపీ రాయలసీమ నేతలు ధ్వజమెత్తారు. కర్నూలులోని లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ తరలింపు నిర్ణయం దారుణంపై వైయస్ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలి.. కానీ పెట్టలేదు. అందరూ విస్మరించినా దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు.
హైకోర్టు కోసం బార్ కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు కర్నూలులో ఏర్పాటైందని వైయస్ఆర్‌సీపీ నేతలు చెప్పారు. వైయస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలులో వేర్వేరుగా వైయస్ఆర్‌సీపీ నేతలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, బీవై రామయ్య మీడియాతో మాట్లాడారు.