రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు ఏ రోజూ ఆలోచన చేయలేదు అని కర్నూలు మేయర్ బీవై రామయ్య వాపోయారు. ఇప్పుడు కూటమిలోని అన్ని పార్టీలు రాయలసీమకు ద్రోహం చేస్తున్నాయి. వైయస్ జగన్ అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని తాపత్రయపడ్డారు. కర్నూలును న్యాయరాజధానిగా చేయాలని అనేక చర్యలు తీసుకున్నారు. నేషనల్ లా యూనివర్సిటీకి శిలాఫలకం వేశారు. చంద్రబాబు మీరు అమరావతిలో కొత్త సంస్ధలు ఏర్పాటు చేసుకోండి.
కానీ, ఈ ప్రాంతంలోని సంస్ధలు అక్కడికి తరలించవద్దు. రాయలసీమ వాసులు బిచ్చగాళ్ళు కాదు. మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. రాయలసీమకు నష్టం జరిగితే చూస్తూ ఊర్కోబోము. ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ ప్రాంత కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? చంద్రబాబు దుర్మార్గ చర్యలు అడ్డుకుంటాం. ఈ ప్రాంత వాసులుగా మేం ప్రాణత్యాగానికైనా సిద్దం. ఆమరణ దీక్షలు చేసి సాధించుకుంటాం. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే వైయస్ జగన్ మళ్లీ సీఎం కావాలి అని కోరారు.