ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లోని AIG హాస్పిటల్తో మరణించారు. 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు.మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. అక్కడ ఓ ఆంగ్ల పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొని ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రానున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కూడా వాయిదా వేశారు. వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa