విశాఖ డెయిరీపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర చర్చ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖ డెయిరీలో అవినీతి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.
ఈ సందర్భంగా డెయిరీలో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపడానికి ప్రత్యేక సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. దీంతో సభా సంఘం నియామకంపై కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa