రాయచోటిలో ఎన్సిసి యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. గురువారం అమరావతి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్సిసి కల్నల్ మోహన్ అగర్వాల్, లెఫ్టినెంట్ కల్నల్ అనిల్ కుమార్ మెహ్రా సమావేశమయ్యారు. యువతలో నైపుణ్యం పెంచడానికి ఎన్సిసి తోడ్పడుతుందని, రాయలసీమలో ఎన్సిసి వృద్ధి కోసం కావలసిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.