గూడూరు మండలం తహసీల్దార్ కార్యాలయం, గూడూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. పిచ్చి మొక్కల తీగలు మొలిచి స్తంభానికి విద్యుత్తు.
లైన్లను అల్లుకుని ఉండడం వల్ల స్థానికులు ఆందోళన చెందడంతో శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు గురువారం తక్షణమే చర్యలు చేపట్టారు. పిచ్చి మొక్కలను తొలగించి ఆ పరిసరాలు శుభ్రం చేయించారు.