ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పూర్వం రోజుల్లో వయస్సు పైబడ్డాక మాత్రమే గుండె పోటు వచ్చేది.కానీ ఇప్పుడు 20 ఏళ్లు నిండిన వారికి కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. ఉన్నట్లుండి హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిన వారిని మనం చాలానే చూస్తున్నాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది.. చిన్న వయస్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు ఎందుకు వస్తున్నాయి.. అన్న విషయాలను సైంటిస్టులు సైతం ఇప్పటికీ తేల్చలేకపోయారు. కానీ హార్ట్ ఎటాక్‌లు అనేవి చాలా వరకు ఒక బలమైన కారణం వల్ల వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఏంటా కారణం.. అంటే..గుండె నుంచి మన శరీర అవయవాలకు రక్తం సరఫరా అవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే రక్తనాళాలు సహజంగానే సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. దీని వల్ల రక్తం సులభంగా సరఫరా అవుతుంది. ఎలాంటి ఆటంకం ఏర్పడదు. కానీ కొందరిలో రక్తనాళాలు సాగే గుణాన్ని కోల్పోతాయి. గట్టిగా మారుతాయి. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండెపై పీడనం, ఒత్తిడి పడతాయి. దీంతో గుండెపై భారం పెరిగిపోతుంది. దీర్ఘకాలికంగా ఇది గుండె కండరాలను లేదా రక్తనాళాలను దెబ్బ తీస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇలా హార్ట్ ఎటాక్‌లు చాలా మందికి వస్తున్నాయి.
కానీ హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసేందుకు ఒక అద్భుతమైన ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుందని సైంటిస్టులు తేల్చారు. అది ఏమిటంటే.. అవిసె గింజలు. అవును.. అవే. వీటి గురించి చాలా మందికి తెలియదు. తెలిసిన వారు కూడా వీటిని తినాలంటే అంతగా ఆసక్తిని చూపించరు. కానీ అవిసె గింజలను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే రక్త నాళాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని తద్వారా రక్త సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడవని, దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నిరోధించవచ్చని.. సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. హార్వార్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీనిపై పలు పత్రాలను కూడా ప్రచురించారు. అందువల్ల అవిసె గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే తద్వారా గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు.
ఇక అవిసె గింజలను నేరుగా తినలేని వారు వాటిని కాస్త పెనంపై వేయించి తినవచ్చు. అవసరం అయితే ఈ గింజలను పొడి చేసి వాటిని ఖర్జూరాలు, తేనెతో కలిపి తినవచ్చు. వాటితో లడ్డూలను చేసుకుని రోజుకు ఒకటి తినవచ్చు. లేదా అవిసె గింజల పొడిని రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. దీన్ని నిత్యం మనం తినే కూరల్లో కలిపి వాడుకోవచ్చు. లేదా పళ్ల రసాలు, స్మూతీలు, మిల్క్ షేక్‌లు, సలాడ్స్‌లోనూ కలిపి అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే నివారించవచ్చు.