ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం అంతాఇంతా కాదు. తరచుగా ఏనుగుల గుంపు సంచరిస్తూ పంట పొలాలను నాశనం చేస్తుంటారు. అడవుల్లో నుంచి గ్రామాల్లోకి చొరబడి.. భయపెడుతున్నాయి. గుంపు ఏనుగులు ఆహారంకోసమో, దాహం తీర్చుకోవడానికో అడవుల మధ్య నుంచి జనావాసాలవైపు వస్తూ దాడులు చేస్తాయి. పంటలను నాశనం చేయడంతో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం ఎగవూరు, దిగవూరు, శాంతినగర్ గ్రామాల్లో ఏనుగుల మంది చొరబడి బీభత్సం సృష్టించాయి. పొలాల్లో తిరుగుతూ పంటలను నాశనం చేశాయి. చేతికందొచ్చిన పంటలను ఏనుగులు నాశనం చేయడంతో ఏడాది కష్టమంతా వృథా అయిపోయిందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.