వైసీపీ రాక్షస పాలనలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం చౌడవరానికి చెందిన యర్రంశెట్టి సాయికృష్ణను మంత్రి నారా లోకేశ్ పిలిపించి అతనితో మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన మంత్రి లోకేశ్‌ను కలిసేలా అనుగ్రహించాలంటూ సాయికృష్ణ మోకాలిపై దుర్గగుడి మెట్లెక్కాడు.తన ఆకాంక్షను సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా తెలియజేశాడు. దీంతో మంత్రి తక్షణమే స్పందించారు. నేడు ఉండవల్లిలోని నివాసానికి సాయికృష్ణను పిలిపించి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.వైసీపీ పాలనలో నాటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ దమనకాండపై ప్లకార్డుల ద్వారా శాంతియుతంగా నిరసన గళం వినిపించాడు. ప్రజాసమస్యలపై కరపత్రాలు పంచాడు. దీంతో వైసీపీ ప్రభుత్వం అతడి ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేసి తీవ్రంగా వేధించింది. సాయికృష్ణ ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంతో అతని కోరిక నెరవేరింది. సాయికృష్ణ పోరాటాన్ని మంత్రి అభినందించారు.