ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్ ప్రాజెక్టులు.. ఇతర అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు. తాజాగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో పవన్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో.. సాయంత్రం 3:15 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో.. 4:30కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో... 5:15కు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో.. బుధవారం ఉదయం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు.
కాగా ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ రెండో సారి ఢిల్లీకి వచ్చారు. కొద్ది రోజుల కిందట ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయనను అమిత్ షా పిలిచినట్లుగా సమాచారం. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఢిల్లీకి వచ్చారు.