సిద్దిపేట జిల్లా గజ్వేల్ పొలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మరియు గజ్వేల్ పోలీసులు నిఘా పెట్టి టెక్నాలజీతో చాకచక్యంగా గంజాయి అమ్ముతున్న నిందితులను పట్టుకున్నారు. కేసు వివరాలు తెలియపరుస్తూ అరికెల శేఖర్, తండ్రి రామచంద్రం, అహ్మదిపుర్ గ్రామం అదే గ్రామానికి చెందిన బోయిని నరేష్, సుక్కసారి భాను ప్రసాద్ ముగ్గురు కలిసి చెడు అలవాట్లకు బానిసయి గంజాయి అమ్మి డబ్బులు సంపాదిద్దామని నిర్ణయించుకొని సిద్దిపేట పరిసర ప్రాంతాలలో బైకులు దొంగతనం చేసి అదే మోటార్ సైకిల్ పై సీలేరుకు వెళ్ళి గతంలో 2, 3 సార్లు గంజాయి తీసుకొచ్చి గజ్వేల్. అమ్మదీపూర్ మరియు చుట్టూపక్కల గ్రామాల కూలీలకు యువకులకు రెట్టింపు ధరకు అమ్మినారు. గత ఎనిమిది నెలల క్రితం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మడానికి వెళుచుండగా త్రీ టౌన్ పోలీసులు పట్టుకొని గంజాయి మోటార్ సైకిల్ రికవరీ చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపినారు. బెల్ పై జైలు నుండి బయటకు వచ్చినారు.
గత వారం రోజుల క్రితం శేఖర్, నరేష్, గంజాయి తీసుకుని రావడానికి సీలేరు వెళుచున్నాము వారి స్నేహితుడు భాను ప్రకాష కు ఫోన్ చేయగా నాకు పని ఉంది నేను రాను నాకు గంజాయి కావాలని 7,000 రూపాయలు శేఖర్ కు ఫోన్ పే చేసినాడు. నరేష్ స్నేహితుడు చింటు బైకు తీసుకొని అరికెల శేఖర్. బోయిని నరేష్ ఇద్దరు భద్రాచలం సీలేరుకు వెళ్లి వర్ధన్ అనే వ్యక్తికి 30,800 వేల రూపాయలు ఇచ్చి 20 కిలోల గంజాయి కొనుగోలు చేసినారు. మోటార్ సైకిల్ పై ఇద్దరు ఒకే సారి వస్తే ఎవరైనా పోలీసులు పట్టుకుంటారని అరికెల శేఖర్. ఒక బ్యాగులో 10 కిలోల గంజాయి పెట్టుకొని హైదరాబాద్ వరకు బస్సులో వచ్చినాడు, బోయిని నరేష్ అక్కడే మోటర్ సైకిల్ పై వద్దామని ఉన్నాడు.అక్కడి నుండి శేఖర్ అహ్మదిపూర్ ఊరికి వచ్చి ఎవరైనా చూస్తారని అనుమానంతో ఊరు బయట గ్రామ శివారు మల్లన్న సాగర్ కట్ట వద్ద దాచి పెట్టినాడు. గంజాయి కావాలని భాను ప్రసాద్ రాగానే అందులో నుండి అతనికి 2 కిలోల గంజాయి పాకెట్ ఇచ్చినాడు.అరికెల శేఖర్, సుక్కసారి భాను ప్రసాద్ నిందితుల వద్ద నుండి 11 కిలోల గంజాయి హష్ ఆయిల్, మరియు 1 సెల్ ఫోన్, రికవరీ చేసి ఇద్దరు నిందితులను గజ్వేల్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది.కేసు పరిశోధన కొనసాగుతుంది త్వరలో నరేష్, వర్ధన్ ఇద్దరు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు.
గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా గంజాయి ఇతర పత్తు పదార్థాలు కలిగి ఉన్న మరియు అమ్ముతున్నారని సమాచారం ఉన్న వెంటనే డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ మొబైల్ నెంబర్ 8712667100 నెంబర్ కు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, పెద్ద మొత్తంలో గంజాయి పట్టించే వారికి నగదు పురస్కారం అందజేస్తామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లా గురించి కృషి చేస్తున్న పోలీసులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సూచించారు.చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, ఇన్స్పెక్టర్లు జానకి రామ్ రెడ్డి, రమేష్, మరియు సిబ్బంది, గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యం రాజు మరియు సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, అభినందించారు. త్వరలో రివార్డ్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.