ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈవీఎంల పై స్పందించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 08:41 PM

ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను, ఆందోళనలను మ­రింత పెంచే మరో పరిణామం చోటుచేసుకుంది. వాటి విశ్వసనీయతపై స్వయంగా భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ కీలక సందేహాలు లేవనెత్తారు. తాజా­గా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై గురు­వా­రం ప్రముఖ న్యూస్‌ చానల్‌ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌­కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్‌ 20న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్‌ జరగడం తెలిసిందే.


‘ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా 55 శాతం మేరకు ఓటింగ్‌ (ప్రొవిజనల్‌ ఓటర్‌ టర్నౌట్‌–పీవోటీ) న మో­దైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ.. మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్తా ఏకంగా 66.05 శాతానికి పెరిగిపోయింది’ అని రాజ్‌దీప్‌ పేర్కొనగా.. ఇంతటి వ్యత్యాసం అ­త్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషీ చెప్పా­రు. దీనిపై తన అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళనలను ఖురేషీ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఓటింగ్‌ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు (రియల్‌ టైమ్‌) నమోదవుతూనే ఉంటాయన్నారు. అలాంటప్పుడు పోలింగ్‌ నాటి సాయంత్రానికి, మర్నాటికి ఇంతటి వ్యత్యా­సం కచి్చతంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమేనని స్పష్టం చేశారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com