రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌తోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖకు సంబంధించి.. ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబు.. ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం వివిధ శాఖలకు 1,74,720 వినతులు రాగా.. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 67,928 ధరఖాస్తులు వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారు.అలాగే ఈ శాఖలో రెవెన్యూ రికార్డులు, భూ కబ్జాలు, అసైన్మెంట్ భూములు తదితర సమస్యలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలియజేశారు. ఈ ఫిర్యాదుల పరిష్కారం ఏ దశలో ఉందనే అంశాన్ని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సత్వరమే.. అదీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని వారికి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
![]() |
![]() |