బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది శనివారం పొద్దున్నే ఇంటింటికి వెళ్లి అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తున్నారు. తెర్లాం మండలం నందబలగ గ్రామంలో ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీ నాయన) పింఛను పంపిణీ చేశారు. అనంతరం కుసుమూరు గ్రామంలో కూడా పింఛను పంపిణీ చేశారు. బేబీ నాయన తమ ప్రభుత్వం పింఛన్లను సకాలంలో అందిస్తుందని తెలిపారు.