విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం భోగాపురం మండలం పోలిపల్లి వద్ద చోటుచేసుకుంది.ప్రాథమిక వివరాల ప్రకారం… ఓ కారు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తోంది. ఈ క్రమంలోనే అదుపు తప్పిన కారు… డివైడర్ ను ఢీకొట్టి అవతలి వైపు రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడకిక్కడే చనిపోయారు. మరోవైపు లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… సహాయక చర్యలు చేపట్టారు.