నేటి బాలలే రేపటి పౌరులని, వారిని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. శనివారం పురపాలక సంఘం 28వ వార్డులో అంగన్వాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు.
పిల్లలు ఎంత మంది చేరారు, ఎంతమంది హాజరయ్యారు, పిల్లలకి ఇచ్చే మెనూ ఎలా ఉంది, క్రమం ప్రకారం మెనూ అమలు చేస్తున్నారా అనే విషయాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం పిల్లలతో కొంతసేపు ముచ్చటించారు.