అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా మా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి అన్నారు. శనివారం మచిలీపట్నం పోతేపల్లి జ్యుయలరీ పార్కులో సిఎస్ఆర్ నిధులు రూ. 1. 98కోట్లతో నిర్మించనున్న కమ్యూనిటీ హాలు (ట్రేడ్ సెంటర్) పనులకు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి భూమిపూజ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొన్నారు.