బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలోని నందబలగ గ్రామంలో ఎమ్మెల్యే బేబీ నాయన శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్ల పెంపు చేసి లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామన్నారు.