గోపన్‌పల్లి తండా చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి గోపన్ పల్లి చెరువు తండాలో పడిఉన్నట్లు చందానగర్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చూడగా గట్టు నుంచి10 మీటర్ల దూరంలో నీటిలో తేలుతూ చనిపోయిన వ్యక్తి కనిపించాడు..గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..
మరణించిన వ్యక్తి సుమారు 30 నుండి 40 సం రాలు ఉండి రౌండ్ నెక్ క్రీమ్ కలర్ టీ-షర్టు, కాకీ కలర్ ప్యాంటు, అతని కుడి చేతిలో వెండి రంగు కడియం ఎడమ చేతికి రబ్బర్ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ ధరించి ఉన్నాడు .మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా చంపి పడేసి వెళ్ళారా అనే కోణంలో చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa