భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఇది ఆభరణాలుగానే కాకుండా.. పెట్టుబడికి కూడా మంచి సాధనం అని చెప్పొచ్చు. ఇక భారతీయ మహిళలు.. ముఖ్యంగా పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల వేళ బంగారు ఆభరణాల్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే.. ఆ సమయాల్లో కొనుగోళ్ల కళ కనిపిస్తుంటుంది. ఇక బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారన్న సంగతి తెలిసిందే. క్యారెట్ విలువ పెరిగే కొద్దీ.. బంగారం స్వచ్ఛత, ధర కూడా పెరుగుతుంటుందని చెప్పొచ్చు. 24 క్యారెట్లు అంటే మేలిమి/స్వచ్ఛమైన బంగారం అని చెబుతారు. ఇది 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం అన్నమాట. కేవలం కాయిన్స్, బిస్కెట్స్, బార్లు రూపంలోనే దొరుకుతుంది.
ఇక ఆభరణాల తయారీలో 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారం వినియోగిస్తారు. దీంట్లో ఇతర లోహాల్ని కలిపి జువెల్లరీ చేస్తారని చెప్పొచ్చు. వీటి స్వచ్ఛ 91.6 శాతంగా ఉంటుంది. 24 క్యారెట్ల కంటే.. 22 క్యారెట్ల బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఇంకా హాల్‌మార్క్ చేసిన జువెల్లరీనే కొనుగోలు చేయాలి. అప్పుడే స్వచ్ఛత గురించి తెలుస్తుంది. హాల్‌మార్కింగ్‌లో బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛత, ఆరంకెల హెచ్ యూఐడీ ఉంటుంది.
గోల్డ్ రేట్లు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవని చెప్పొచ్చు. స్థానిక పన్ను రేట్లు ఇతర కారణాలతో రేట్లు మారుతుంటాయి. ఇంకా షిప్పింగ్ ఛార్జీలు కూడా ప్రభావం చూపిస్తాయి. ప్రాంతాల్ని బట్టే.. కొన్ని షాపుల్లో కూడా ధరలు వేర్వేరుగా ఉంటాయి. చాలా వరకు జువెల్లరీలో పన్నులు, ఇతర సుంకాలు కలపకుండా లోహాల ధరల్ని ప్రకటిస్తుంటాయి. దీంతో ధర తక్కువగా కనిపిస్తుంది. ఆభరణం కొనుగోలు చేసే సమయంలో.. మేకింగ్ ఛార్జీలు, తరుగు, జీఎస్టీ, హాల్ మార్కింగ్ వంటివి కలుపుతుంటారు. తరుగు, మేకింగ్ ఛార్జీల్లో కూడా జువెల్లరీని బట్టి తేడాలుంటాయి. గోల్డ్ కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. బిల్లు లేకుంటే ఒకవేళ గోల్డ్ నాణ్యత లేకపోతే.. ఫిర్యాదు చేసేందుకు వీలుండదు.
ప్రస్తుతం దేశంలోని ప్రముఖ జువెల్లరీల్లో బంగారం రేటు గ్రాముకు నవంబర్ 30న సాయంత్రం ఎంత పలుకుతుందనేది తెలుసుకుందాం. కల్యాణ్ జువెల్లర్స్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ. 7,150గా ఉంది. తనిష్క్ జువెల్లరీలో చూసినట్లయితే గ్రాము గోల్డ్ ధర రూ. 7,240 పలుకుతోంది. మలబార్ గోల్డ్‌లో గ్రాము పసిడి ధర రూ. 7,150 గానే ఉంది. జోయాలుక్కాస్‌లో కూడా రూ. 7,150 పలుకుతోంది. బంగారు ఆభరణాల్ని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో లోన్లు కూడా తీసుకోవచ్చు.