గాజువాక సమీపంలోని వడ్లపూడిలో సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఆదివారం మహారుద్రాభిషేకం నిర్వహించారు. 87వ వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాథం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధనలో పాల్గొని భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
![]() |
![]() |