రైతుల ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వం సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించింది. రైతుల పాదయాత్రతో చిల్లా సరిహద్దులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.భారతీయ కిసాన్ పరిషత్ (బికేపీ)నేత సుఖ్‌బీర్ ఖలీఫా మీడియాతో మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం న్యాయమైన పరిహారం, మెరుగైన ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేపట్టారన్నారు. తూర్పు ఢిల్లీ పోలీసుల అధికారి అపూర్వ గుప్తా మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళనపై తమకు ముందస్గు సమాచారం అందిందని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదన్నారు. శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తున్నామన్నారు.