ఏపీలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ తేదీల్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అలాగే మార్చి 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక మానవ విలువలు, నైతికత పరీక్ష ఫిబ్రవరి 1, 3వ తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల కానుంది.